గుర్మీత్‌కు ఉరిశిక్ష..?

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ బాబా‌కు ఉరిశిక్ష పడుతుందా అంటే అవుననే అంటున్నారు న్యాయనిపుణులు..ఇప్పుడు ఆయన అనుభవిస్తున్న శిక్ష అత్యాచారానికి సంబంధించినది కానీ ఆయనపై గతంలోనే రెండు హత్య కేసులు ఉన్నాయి..డేరాలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, గుర్మీత్ అసలు స్వరూపాన్ని మొట్టమొదటిసారిగా బాహ్య ప్రపంచానికి తెలియజెప్పిన, జర్నలిస్ట్ రామ్‌చందర్ ఛత్రపతి ఆత్మహత్య, అప్పట్లో డేరా మేనేజర్‌గా పనిచేస్తూ అనుమానాస్పద స్థితిలో శవంగా తేలిన రంజిత్ సింగ్‌ల మరణాల వెనుక డేరా బాబా ఉన్నాడని వాదనలు వినిపిస్తున్నాయి. ఛత్రపతిని చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించారని..తన రహస్యాలను ఎక్కడ బయటపెడతాడోనన్న అనుమానంతో రంజిత్‌ను హత్య చేయించాడని చెప్పుకుంటూ ఉంటారు..ఈ రెండు ఉదంతాలపై గుర్మీత్‌పై అభియోగాలు నమోదవ్వగా..గతంలోనే సాక్షుల విచారణ ముగిసింది. ఇవాళ్టీ నుంచి పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో తుది వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డేరా బాబాకి మరణదండన విధిస్తారని ప్రచారం జరుగుతోంది.