మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అరెస్ట్..

Publish Date:Jan 12, 2017

 

ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు మయూర్ విహార్‌లో సోదాలు నిర్వహించి దాడి చేసి వీరిని పట్టుకున్నారు. అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదులు మణిపూర్ ఉగ్రదాడిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని పోలీసులు తెలిపారు. కాగా గతేడాది ఉగ్రవాదులు మణిపూర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై దాడిచేసి 20 మంది జవాన్లను హతమార్చిన విషయం తెలిసిందే.

By
en-us Politics News -