క్లీన్ స్వీప్ దిశగా బీజేపీ...

 

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుంది. మొత్తం మూడు కార్పొరేషన్లలోని 270 వార్డులకు ఎన్నికలు జరగగా... భాజపా గెలుపు దిశగా దూసుకెళ్తొంది. ఇక కాంగ్రెస్, ఆప్ పార్టీలు రెండు స్థానం కోసం పోటీపడుతున్నాయి. ఉత్త‌ర ఢిల్లీలో 72, ద‌క్షిణ ఢిల్లీలో 70, తూర్పు ఢిల్లీలో 39 స్థానాల ఆధిక్యంలో బీజేపీ ఉంది. ఉత్త‌ర‌, తూర్పు ఢిల్లీల్లో కాంగ్రెస్ రెండోస్థానంలో ఉండ‌గా.. ద‌క్షిణ ఢిల్లీలో మాత్ర‌మే ఆమ్ ఆద్మీ రెండోస్థానంలో కొన‌సాగుతున్న‌ది. ఇదిలా ఉండగా.. ఆప్ మాత్రం ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లే కారణమని ఆరోపించింది. ఆ పార్టీ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ, "ఇదేమీ మోడీ వేవ్ కాదు. ఈవీఎం వేవ్" అని వ్యాఖ్యానించారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడేలా ఓటింగ్ యంత్రాలను మార్చినందునే ఆ పార్టీకి విజయం సాధ్యమైందని ఆయన ఆరోపించారు.