ఎయిర్ హోస్టెస్ చావుకు కారణం అదేనా?

 

దేశం విద్యా రంగంలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఎంత అభివృద్ధి చెందినా, ఎంతటి విద్యావంతులు అయినా దేశంలో ఇప్పటికి వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్ళై రెండేళ్ళైనా కాలేదు, ఎయిర్ హోస్టెస్ గా గాలిలో విహరించాల్సిన  32 ఏళ్ల అనిస్సియా బాత్రా ప్రాణాలు వరకట్న వేధింపులు తాళలేక గాలిలో కలిసిపోయాయి. గత శుక్రవారం అనిస్సియా ఇంటి టెర్రస్ మీద నుంచి దూకిందని, దూకేముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంక్షిప్త సందేశం పంపిందని, ఆ సమయంలో తాను ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను టెర్రస్ చేరుకునే సమయానికి తాను దూకేసిందని, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లానని, అప్పటికే తాను మృతి చెందినట్లు డాక్టర్స్ చెప్పారని భర్త మయాంక్ సింగ్వి పోలీసులకు తెలిపారు.

శుక్రవారం జరిగిన పోస్టుమార్టం గురించి బాత్రా కుటుంబ సభ్యులకు సింగ్వి తెలిజేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. సింగ్విని వదిలిపెట్టొద్దు తాను నన్ను వేధిస్తున్నాడని సందేశం పంపినట్లు బాత్రా అన్నయ్య కరణ్ తెలిపారు. మరో మరు పోస్టుమార్టం నిర్వహించాలని బాత్రా కుటుంబసభ్యులు కోరారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, విచారణ చేపడతామన్నారు. సింగ్విపై  బాత్రా కుటుంబ సభ్యులు ఒక నెల క్రితమే వరకట్న వేధింపుల విషయంలో పోలీసులను ఆశ్రయించారు.