దీప ఇంట్లో నకిలీ ఐటీ దాడులు.. చేయించింది ఎవరో తెలుసా...?

 

ఒకపక్క శశికళ, ఆమె కుటుంబ సభ్యల ఇళ్లలో ఐటీ అధికారులు దాడులు జరిపి వేల కోట్ల ఆస్తులను బయటపెడుతున్నారు. ఇక ఈ ఆస్తులను చూసి తమిళనాడు మొత్తం షాక్ తో నోరెళ్లపెడుతుంది. ఇప్పుడు తాజాగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ఇంటిపై కూడా ఐటీ ఆధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ ఐటీ దాడులు చేసింది నిజమైన ఐటీ అధికారులు కాదట.. నకిలీ ఐటీ అధికారలట. దీప పోలీసులకు చేసిన ఫిర్యాదు చేయడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీప ఇంటికి వచ్చిన అధికారులు అసలు ఐటీ అధికారులు కాదన్న అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.... దీపను భయపెట్టేందుకే భర్త మాధవన్‌ ఇలా చేశాడని... దీపను భయపెట్టడమే తమ ఉద్దేశమని చెప్పారు. దీంతో పోలీసులు మాధవన్ పై కేసు నమోదుకు సిద్దమయ్యారు.