దీపా జయకుమార్ ఆస్తులు ఇవే...

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతంరం ఆర్కే నగర్ నియోజక వర్గ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో జయ మేనకోడలు దీపా జయకుమార్ కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ క్రమంలో తన ఆస్తుల విలువ 3.05 కోట్ల రూపాయలని తెలిపారు. ఇందులో రెండు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, 1.05 కోట్ల రూపాయల విలువైన చరఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే ఈ ఆస్తులపై 2016-17 వార్షిక సంవత్సరానికి గాను తనకు 5.37 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. 2016-17 సంవత్సరంలో తనకు రూ.5.37లక్షల ఆదాయం వచ్చిందని, రూ.1.72 లక్షల విలువైన నాలుగు కేజీల వెండి, రూ.4లక్షల విలువైన 20 వజ్రాలు తన వద్ద ఉన్నట్లు ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన వద్ద రూ.3.50లక్షల నగదు ఉందని, బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలో రూ.1.77లక్షలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.