దావూద్ ఇబ్రహీం ఆస్తులు సీజ్.. అంతా ఉత్తుత్తే...

 

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన  రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తులను యూఏఈ ప్రభుత్వం సీజ్ చేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు దీని వెనుక ప్రధాని మోడీ హస్తం కూడా ఉందని.. యూఏఈ పర్యటనకు వెళ్లిన మోదీ... దావూద్ అక్రమాలపై రుజువులు చూపించారని, దీని కారణంగానే దావూద్ ఆస్తులను అక్కడ సీజ్ చేశారంటూ కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. యూఏఈ ప్రతినిధి అహ్మద్ అల్ బనా ఈ విషయంపై మాట్లాడుతూ, ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఆస్తులను సీజ్ చేయడం జరగాలంటే... అది యూఏఈ న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ మొదలు కాలేదని ఆయన స్పష్టం చేశారు.