ప్రస్తుత సీఎం రాజీనామా ఖాయం.. కొత్త సీఎంగా దళితుడు!!

 

 

క‌ర్ణాట‌క‌లో రోజుకొక తీరుగా రాజకీయం మలుపులు తిరుగుతోంది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) కూట‌మికి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాల వ్య‌వ‌హారం ఇంకా తేల లేదు. దీని పై ఎవరి వాదనలు వారు చేస్తున్నారు. ఐతే తాజాగా కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు అమ్మ‌ణ్ణ‌య్య ఉడిపిలో విలేకరులతో మాట్లాడుతూ చంద్ర‌గ్ర‌హణం త‌రువాత రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని తెలిపారు. సీఎం కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయదనాయికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయన స్థానం లోఒక దళిత నాయకుడు సీఎం అవుతారని ఆయన తెలిపారు. ఆ నాయకుడు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఐన ఆశ్చర్యపోనవసరం లేదని అయన అన్నారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యెడ్యూరప్ప మరోసారి సీఎం అయ్యే అవకాశాలు ప్రస్తుతం లేవని, దానికి అయన గ్రహగతులు అనుకూలించట్లేదని అయన తెలిపారు.