కాంగ్రెస్ లోకి డీఎస్.. ఆయన బాటలోనే మరో నేత.!!

తెలంగాణలో ఓ వైపు ముందస్తు చర్చ జోరుగా సాగుతుంటే మరోవైపు డీఎస్ చర్చ కూడా జరుగుతుంది.. నిజానికి డీఎస్ కాంగ్రెస్ లో చేరుతారనే చర్చ ఎప్పటినుండి జరుగుతుంది.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన డీఎస్ రాష్ట్ర విభజన అనంతరం తెరాసలో చేరారు.. తెరాస కూడా ఆయనకు రాజ్యసభ ఇచ్చి గౌరవించింది.. కానీ తరువాతే పరిస్థితులు మారిపోయాయి.

 

 

డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ కవిత మరియు కొందరు నిజామాబాద్ తెరాస నేతలు సీఎం కేసీఆర్ కు రాసారు.. ఇక అప్పటి నుండి డీఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారంటూ వార్తలు వినిపించాయి.. కానీ అది జరగలేదు.. అయితే రీసెంట్ గా డీఎస్ నాకు నేనుగా రాజీనామా చేయను కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ తెరాస అధినాయకత్వానికి లేఖ రాసారు.. పార్టీకి రాజీనామా రాజ్యసభ వదులుకోవాల్సి వస్తుందని డీఎస్ నాటకాలు ఆడుతున్నారంటూ విమర్శలు కూడా వచ్చాయి.. అయితే డీఎస్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ఆయన చేరికకు కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నలిచ్చిందని సమాచారం.. ఈనెల 11న సోనియా, రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలోకి చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఆయనతో పాటుగా మరో కీలక నేత ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం.