శవాన్ని దోచేశారు

శవం మీద పేలాలు ఏరుకుని తినే బాపతు అనే మన పెద్దలు అంటూ ఉంటారు. వారు అలా ఎందుకు చెప్పారో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. అనారోగ్యంతో మరణించిన ఓ మహిళ మెడలో ఉన్న బంగారపు గొలుసును చోరీ చేశారు కేటుగాళ్లు. సంగారెడ్డి జిల్లా కంగ్టి గ్రామానికి చెందిన కళావతి అనే మహిళకు అనారోగ్యం ఉండటంతో ఓ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. కళావతి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకు ఆమె కుమారుడు అంబులెన్స్ మాట్లడేటప్పటికే మృతరాలి మెడలో ఉన్న 3.5 తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. దీనిని గమనించిన అతను విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాడు.. కానీ వారు స్పందించకపోవడంతో 100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.