అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో ఉన్న సీఆర్డీఏ అధికారులు...

 

కరకట్ట వెంబడి అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. ప్రముఖ శైవక్షేత్రం తాళ్లాయపాలెంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. శైవక్షేత్రం పక్కనే నిర్మించిన క్యాంటీన్లు, బాత్రూంలను కూల్చివేస్తున్నారు. సీఆర్డీఏ అధికారి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. కరకట్ట వెంబడి ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

సీఆర్డీఏ అధికారులు ఇప్పటికే ఒకటి రెండు అక్రమ కట్టడాలకు సంబంధించి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లకి నోటీసులు అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పాతూరి కోటేశ్వరరావుకి సంబంధించిన అక్రమ కట్టడాన్ని తొలగించే క్రమంలో ర్యాంపు లాంటిది ఉంటే గతంలోనే సీఆర్డీఏ అధికారులు తొలగించారు. కాబట్టి ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. 

శైవక్షేత్రం ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను ప్రస్తుతం సీఆర్డీయే అధికారులు తొలగిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద కృష్ణానది కరకట్ట లోపలకు ఉన్న అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో ఆ అక్రమ కట్టడాలను తొలగించే దిశగానే ప్రభుత్వం కొనసాగుతోందని వెల్లడవుతోంది. ఒకేసారి అన్ని కాకుండా ఒక్కొక్కటిగా వీలునుబట్టీ అలాగే అక్కడున్న పరిస్థితులను అంచనా వేసుకుంటూ, అక్రమ కట్టడాల కూల్చివేత దిశగా చర్యలు తీసుకుంటుంది. 

దీంట్లో భాగంగా తాళ్లాయపాలెంలో అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారానికి సంబంధించిన పనులు ప్రస్తుతం అక్కడ జరుగుతున్నాయి. శైవక్షేత్రంకి సమీపంలోనే ఉన్న బాత్ రూంలు,క్యాంటీన్ లను కూడా ప్రస్తుతం అక్కడ కట్టడాల కూల్చివేత వ్యవహారం  జరుగుతోంది .మొత్తంగా చూస్తే ఒక్కొక్కటిగా అంటే కొంత మంది లింగంనేని గెస్ట్ హౌస్ కి సంబంధించి ప్రస్తుతం చంద్రబాబునాయుడు ఎక్కడ నివాసం ఉన్నారో ఆ స్థలాన్ని ఉన్న భవనం కూడా అక్రమ కట్టడాలుగా  భావించి  తొలగించాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు అధికారులు.మొత్తం మీద అక్రమ కట్టడాలపై నిజమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందా లేదా కక్ష సాధింపు చర్యలు చేపట్టే పనిలో ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది.