పవన్ లో నచ్చింది అదే..

 

ఏపీ ప్రత్యేకహోదా పోరాటంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వామపక్ష పార్టీలతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పపన్ ను ప్రశంసించారు. కడప జిల్లాలో జరుగుతోన్న సీపీఐ 26వ రాష్ట్ర మహాసభల సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ మరోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... వామపక్ష పార్టీలు పేదల కోసం పనిచేస్తాయని, ఆ పార్టీల నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉంటారని.. అలాంటి తమతో పవన్ కల్యాణ్‌ పనిచేస్తామని ముందుకు వచ్చారని.... పవన్ లో తమకు నచ్చిన అంశం ఇదే అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాను ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధించలేమని, తాము మోదీ హఠావో అనే నినాదంతో ముందుకు వెళతామని అన్నారు.