ఎయిడ్స్ కంటే క‌రోనానే దారుణంగా వుంద‌ట‌!

కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన వారి జాబితాలో సెక్స్ వర్కర్లు కూడా చేరారు. కరోనా దెబ్బకు యూరప్ లో నైట్ క్లబ్బులు మూతపడ్డాయి. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో నైట్ క్లబ్బులు బంద్ అయ్యాయి. అన్ని రెస్టారెంట్లు, కేఫ్‌లు, స్కూళ్లు, నైట్ క్లబ్బులతోపాటు రెడ్ లైట్ ప్రాంతాలను మూసివేయాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. హషీస్, కాన్నబీస్‌, గంజాయి లాంటి మాదకద్రవ్యాలను విక్రయించే డచ్ బార్లను ప్రభుత్వం ఆదేశించింది. నైట్ క్లబ్బులకు పేరు గడించిన అడల్డ్ క్లబ్బులు, రెడ్ లైట్ ఏరియాలను కూడా ప్రభుత్వం మూసివేయించింది. కాసా రోసో, పీప్‌షో, బనానా బార్, ఎరోటిక్ మ్యూజియం వంటి అడల్డ్ క్లబ్బులు మూతపడిన వాటిలో ఉన్నాయి.

ముంబైలోని రెడ్ లైట్ ఏరియా కామటిపురలోని వేశ్యలపైనా క‌రోనా ప్రభావం చూపింది. సాధారణంగా వేశ్యల దగ్గరికి నిత్యం విటులు వచ్చి పోతుంటారు. అలా వచ్చిన వారి ద్వారా సెక్స్ వర్కర్లకు కరోనా సోకే ముప్పు ఎక్కువ దీంతో సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కరోనా భయాందోళనల కారణంగా విటుల రాక తగ్గిపోవడంతో.. సెక్స్ వర్కర్లకు ఆదాయం కూడా తగ్గిపోయింది. రోజువారీ ఖర్చులకు కూడా వారికి ఇబ్బంది అవుతోంది. దీంతో చాలా మంది వేశ్య‌లు తమ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.

ఎయిడ్స్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అయిన‌ప్పుడు కూడా ఇంత దారుణంగా లేద‌ని, పరిస్థితి ఎన్నడూ లేనంతగా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయామని ముంబాయిలోని ఓ సెక్స్ వర్కర్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘కామ‌టిపుర అంతా ఎడారిలా మారిపోయింది. దీంతో తన బిజినెస్ తగ్గిపోయిందని కామటిపురకు చెందిన ఓ టైలర్ వాపోయాడు. లోకల్ సెక్స్ వర్కర్లకు దుస్తులు కుట్టి డబ్బు సంపాదించే వాడినని.. కానీ వారికే ఉపాధి లేకపోవడంతో తనకు కూడా రాబడి తగ్గిందని అతడు చెప్పాడు.