మహిళపై రేప్‌.... కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్ట్...

 

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఎం విన్సెంట్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్దికాలం నుండి విన్సెంట్‌ 51 ఏళ్ల మహిళను రేప్‌ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆయనను పోలీసులు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 51 ఏళ్ల మహిళను వెంటాడి అత్యాచారం చేసి.. ఆత్మహత్యకు పూరిగొల్పినట్టు ఇప్పటికే అదనపు అభియోగాలను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు ఈ వివరాలను కోర్టుకు సమర్పించారు. అంతేకాదు బాధిత మహిళ, ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడిన ఆడియో క్లిప్‌ పోలీసులకు లభించడం.. అందులో ఎమ్మెల్యే విన్సెంట్‌పై మహిళ తీవ్ర అభియోగాలు చేయడంతో కేసులో కీలక సాక్ష్యంగా మారింది.