హేమామలిని బుగ్గల్లాంటి రోడ్లు వేపించాను.. కాంగ్రెస్ నేత వింత పోలిక

 

చత్తీస్‌గఢ్‌కు చెందిన ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తన నియోజకవర్గ స్థాయిలో వేయించిన రోడ్లను హేమమాలిని బుగ్గలతో పోలుస్తూ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. తాను నక్సల్ ప్రభావిత ప్రాంతం నుండి ఎన్నికైన ఎమ్మెల్యేనని తెలిపారు. అలాంటి ప్రాంతంలో కూడా రోడ్లను ఎంతో చక్కగా.. స్మూత్ గా.. వేయించానని చెప్పాలనుకున్నారు. ఆయన చేసిన పని హర్షణీయమైనా.. పోల్చిన పోలిక విమర్శలకు దారి తీసింది.

తన ప్రాంతంలోని రోడ్లన్నీ హేమమాలిని చెంపల మాదిరిగా నిర్మించానంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన కామెంట్స్ పై స్పందించిన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లఖ్మా వెంటనే సదరు మహిళా నేత హేమామాలినికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.కవాసీ లఖ్మాకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఒక పాఠశాలలోని కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తనలా రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటే కలెక్టర్, ఎస్పీల కాలర్‌లు పట్టుకోవాలని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా రోడ్లను బుగ్గలతో పోల్చాడంటే ఆయన హేమామలినికి ఎంత పెద్ద అభిమాని అయ్యుంటాడు అని నెటిజన్లు జోకులు వేస్తున్నారు.