పవన్ పై విమర్శలు చేసిన పృధ్వీకి షాకిచ్చిన స్టార్ హీరో!!

 

టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. వైసీపీ గెలిచిన తరువాత కూడా పవన్ పై విమర్శలు చేశారు. ఆయన పవన్ పై విమర్శలు చేయడం మెగాహీరోలను బాధపెట్టింది. ఆ కారణంగానే ఇప్పుడు తమ సినిమాల్లో పృధ్వీకి అవకాశాలు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారట.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో పృధ్వీ కోసం త్రివిక్రమ్ ఓ రోల్ అనుకున్నాడట. అయితే అల్లు అర్జున్ మాత్రం దీన్ని వ్యతిరేకించారట. తన సినిమాల్లో పృధ్వీకి చోటు లేదని బన్నీ చెప్పడంతో.. పృధ్వీకి బదులుగా త్రివిక్రమ్ మరో కమెడియన్ ని తీసుకున్నారట. ఈ విధంగా చూసుకుంటే మెగాహీరోల చిత్రాల్లో పృధ్వీకి అవకాశాలు రావడం కష్టమనే అనిపిస్తోంది.