సీఎం ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది..!

 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలోక్ మిశ్రా అనే విద్యార్ధి, పదో తరగతి పరీక్షల్లో ఏడో ర్యాంక్ సాధించాడు.. అతని ప్రతిభకి సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష రూపాయల చెక్ ఇచ్చారు.. సాక్ష్యాత్తు సీఎం చేతుల మీదుగా చెక్ తీసుకోవడంతో.. ఆ విద్యార్థి ఆనందానికి అవధుల్లేవు.. కానీ అదే ఆనందంతో బ్యాంకుకి వెళ్లిన ఆ విద్యార్థికి అనుకోని షాక్ తగిలింది.. అదేంటి అంటే చెక్ బౌన్స్ అయింది.. ఇది తెల్సిన అధికారులు ఆ విద్యార్థికి మరో చెక్ ఇచ్చారు.. ఇక ఈ విషయం తెల్సిన ప్రజలు సీఎం చేతుల మీదుగా ఇచ్చిన చెక్ విషయంలో కూడా అధికారులు ఇంత నిర్లక్షంగా ఉంటే ఎలా అంటూ మండిపడుతున్నారు.