అమిత్ షా ఎవరు మమ్మల్ని అడగటానికి..?

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకకు కేంద్రం 2 లక్షల కోట్ల నిధులు మంజూరు చేసిందని.. కానీ నిధులను సీఎం సిద్దరామయ్యతో సహ కాంగ్రెస్ నాయకులు స్వాహా చేశారని అమిత్ షా ఆరోపించారు. ఇక దీనిపై స్పందించిన సీఎం సిద్దరామయ్య అమిత్ షా పై మండిపడ్డారు.  మా రాష్ట్రానికి చెందిన ఖర్చుల లెక్కలు అడగటానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవరు ? మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా పని చేసిన సమయంలో గుజరాత్ కు కేంద్రం నిధులు మంజూరు చేసిందని.. అప్పుడే మేము అడిగామా...? ఏం అయ్యిందని ప్రశ్నించామా అని అన్నారు. తాము చెల్లిస్తున్న ఆదాయపన్నులోనే కేంద్ర ప్రభుత్వం మళ్లీ మాకు నిధులు మంజూరు చేస్తుంది... తమ ప్రభుత్వం నిధులు ఎంత ఖర్చు చేసింది అనే విషయం కర్ణాటక ప్రజలకు చెబుతామని, అమిత్ షాకు కాదని సిద్దరామయ్య ఘాటుగా సమాధానం ఇచ్చారు.