అమ్మో సోనియమ్మ-కిరణేమో కీలుబొమ్మ

 

CM Kiran Sonia, Sonia Gandhi, CM Kiran Kumar Reddy, telangana, samaikyandhra

 

 

రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నందుకు సోనియాగాంధీ పేరు చెబితేనే కంపరం పుట్టుకొస్తున్నా, ఆమె రాజకీయ చతురతకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేమని కొంతమంది సమైక్యవాదులు అంటున్నారు. ఇందిరాగాంధీతో సహా నెహ్రూ కుటుంబంలో ఎవరికీ లేని కొంపలు ముంచే రాజకీయ తెలివితేటలు సోనియాగాంధీకి మాత్రమే ఎలా ఒంటబట్టాయా అని అనుకుంటున్నారు. రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఎన్నో సందర్భాలలో సోనియా గాంధీ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించింది. ఎప్పటి విషయాలో, ఎక్కడి విషయాలో ఎందుకు? రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టిన విభజన చిచ్చునే చూడండి.

 


మహాతల్లి ఎంత చక్కగా అంటించిందో!  అత్త ఇందిరాగాంధీ కూడా చేతులెత్తేసిన తెలంగాణ ఇష్యూని పెంచి, పోషించించి. చివరకి ఆ సమస్యని తన పుత్రరత్నం ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడేలా చేసుకుంది. ఈ రేంజ్ రాజకీయాలు ప్రదర్శిస్తున్న ఇటాలియన్ సోనియాగాంధీని చూసి మనదేశ రాజకీయ నాయకులు పాఠాలు నేర్చుకోవాలి. తెలంగాణకి సోనియాగాంధీ ఓకే అంది కాబట్టి వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్, అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌కే మెజారిటీ వస్తుంది. సీమాంధ్రలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మటాషేనని అమాయక ఇండియన్లు మొదట్లో అనుకున్నారు. ఆ తర్వాత సోనియమ్మ తన ఇటలీ పాలిటిక్స్ బయటపెట్టింది.




జైల్లోనే శేషజీవితం గడిపేస్తాడేమోనని అందరూ అనుకున్న జగన్‌ని బయటకి తీసుకొచ్చింది. సమన్యాయం జగన్ని సమైక్యవాదం వైపు మళ్ళించి సీమాంధ్రలో జగన్నాటకానికి తెరతీసింది. దాంతో సీమాంధ్రలో జగన్‌కి వచ్చే ఓటు బ్యాంకుని, సీటు బ్యాంకుని తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేసింది. ఒకవేళ ఫ్యూచర్లో జగన్ తోకజాడిస్తే ఎలా అనుకుంది. సేఫ్ గేమ్ మొదలెట్టి సీఎం కిరణ్‌ని సమైక్యవాదిగా రంగంలోకి దించింది. సీఎం కిరణ్ సోనియమ్మ చెప్పినప్పుడల్లా సమైక్యవాదాన్ని వినిపిస్తూ సీమాంధ్ర ప్రజలకు చేరువైపోతున్నాడు. రేపోమాపో సీమాంధ్రలో పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ కొత్తపార్టీ స్కీమ్ కూడా సోనియాగాంధీదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.




సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మలా మారిన కిరణ్‌కుమార్‌రెడ్డిని చూసి జాలిపడుతున్నారు. మొత్తమ్మీద రాజకీయ కీకారణ్యంలో సోనియాగాంధీ పెద్ద హంటర్.  ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టేసింది. అటు తెలంగాణలో పెద్దపిట్ట కేసీఆర్‌ని గ్రిప్‌లో వున్నాడు. ఇక సీమాంధ్రలో పోటీపడే కిరణ్, జగన్ ఇద్దరూ కాంగ్రెస్ గూటి పిట్టలే. వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే పక్షంలో రెండు రాష్ట్రాల్లోనూ తనదే హవా.. ఇదీ సోనియమ్మ వేసిన ప్లాన్. అంతా బాగానే వుందిగానీ, సోనియాగాంధీ అసలు స్వరూపాన్ని తెలుగు ప్రజలు కనిపెట్టేశారు. ఇక తెలుగోళ్ళ దగ్గర సోనియాగాంధీ తప్పులు ఉడకవ్!