హుజూర్ నగర్ లో కేసీఆర్ మీటింగ్ రద్దు.. కారణం?

 

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదు అన్నట్లు తయారయ్యింది పరిస్థితి.వివరాళ్లోకి వెళ్తే హుజూర్ నగర్ లో కేసీఆర్ మీటింగ్ జరుగుతుందా లేదా అని ఉత్కంఠంతో ఎదురు చుసిన ప్రజలకు తెర పడింది. టీఆర్ఎస్ సభ రద్దైంది.పొద్దుటి నుంచి సీఎం రాక కోసం ఎన్నొ ఆర్బాటాలు చేసిన సిబ్బంది కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు పాలైయ్యింది. సభా ప్రాంగణం వద్ద భారీగా వర్షం పడుతుండటం కేసీఆర్ అక్కడికి చేరుకునే అవకాశం లేకపోవటంతో సభ రద్దయ్యింది. వర్షం కారణంగా కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. భారీ వర్షం కురుస్తున్నందు వల్ల సభను రద్దు చేసుకోవడమే మంచిదని ఏవియేషన్ అధికారులు చెప్పడంతో కేసీఆర్ సభను రద్దు చేసుకున్నారు. 

సభా ప్రాంగణానికి కార్యకర్తల కూడా పూర్తిస్థాయిలో చేరుకోలేదు. వచ్చిన కొంత మంది కూడా భారీ వర్షం కారణంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పోయారు. అటు అధికారులు పోలీసులు కూడా సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లి పోయారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసిఆర్ తో ప్రచారం చేయించేందుకు టిఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. చివరి వరకూ కేసీఆర్ వస్తారో రారో అని ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే సస్పెన్స్ కు తెరదించుతూ సభకు రావాలని కెసిఆర్ నిర్ణయించుకున్న వర్షం కారణంగా సభ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు హాజరు కావాలని చూసిన కెసీఆర్ కు వరుణ దేవుడు ఆటంకంగా మారాడు.