ఆఫీసుల్లోనే కూర్చోవడం కాదు...

Publish Date:Jan 11, 2017


జన్మభూమి-మాఊరు పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జన్మభూమి విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జన్మభూమి స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు. ఇంకా నాల్గో విడత జన్మభూమిలో, పోలవరం ప్రాజెక్ట్ కాంక్రీటు పనులు ప్రారంభించడం.. ముచ్చుమర్రి నీటిని విడుదల చేయడం.. రాయలసీమకు సాగునీటి మార్గం చూడటం.. పురుషోత్తపట్నం శంకుస్థాపన.. ఇవాళ గండికోట నీటి విడుదల చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామానికి వెళ్లి పదిమందితో మాట్లాడితో ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాని కార్యలయానికే పరిమితమవ్వడం కాదని... పనులు చేయడమే కాదు ఫలితాలు ప్రజలకు అందడం ప్రధానమని తెలిపారు. అంతేకాదు వచ్చే ఏడాది రానున్న నిధులపై ప్రణాళిక ఏర్పాటు చేయాలని.. గ్రామస్థాయి నుండి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి, వాటన్నింటిని క్రోడీకరించి రాష్ట్ర బడ్జెట్ తయారు చేయాలని.. దాదాపు 3 వేలకోట్ల రూపాయల బడ్జెట్ కు ప్రణాళిక సిద్దం చేయాలని తెలిపారు.

By
en-us Politics News -