అరగంట చదివినా అర్థం కాలేదు.. ఆర్టికల్ 370 పిటిషన్ పై సుప్రీం ఫైర్!

 

ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌దారులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగోయ్  అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి పిటిషన్‌ వేశారంటూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మను ప్రశ్నించారు. అరగంటపాటు చదివినా పిటిషన్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటో అర్థం కాలేదన్నారు. మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు ఈ విషయంపై మొత్తం 7 పిటిషన్లు దాఖలు కాగా.. అందులో నాలుగింటిలో లోపాలున్నాయన్నారు. ఏం కోరుకుంటున్నారో స్పష్టత లేకుండా పిటిషన్ ఎలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పిటిషన్‌లో సవరణలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది శర్మ కోరారు.