సెంటిమెంట్ గౌరవించాలి: టిపై చిరంజీవి

 

chiranjeevi telangana, chiranjeevi sonia gandi, sonia gandi T issue

 

 

రాష్ట్ర విభజన పై ఈరోజు నిర్ణయం వస్తుందన్న నేపథ్యంలో ముగ్గురు కేంద్రమంత్రులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు మధ్యాహ్నం పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలుసుకున్నారు. చిరు, పళ్లం రాజు, జెడి శీలం, కనుమూరి బాపిరాజు తదితరులు ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

 

అన్ని ప్రాంతాల సెంటిమెంట్ లను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని, పార్టీ, ప్రజల భవిష్యత్తు ,సెంటిమెంటును పరిగణనలోకి తీసుకోవాలని కోరామని వారు అన్నారు. అందరికి న్యాయమైన నిర్ణయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. రాహుల్ తోకూడా తాము సమావేశం అయ్యామని, అందరూ తమకు సమానమేనని ఆయన స్పష్టం చేశారని అన్నారు. ఎవరికి అన్యాయం జరిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించామని చిరంజీవి తెలిపారు.



ఇరు ప్రాంతాల భవిష్యత్తు ముఖ్యమన్నారు. తనకు అందరూ సమానమే అన్నారు. ఇరువర్గాల సెంటిమెంట్‌ను అర్థం చేసుకోవాలన్నారు. తమకు తమ భవిష్యత్తు ముఖ్యం కాదని ప్రజలు, పార్టీ భవిష్యత్తు ముఖ్యమన్నారు.