చిరంజీవి దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ జనసేన...!

 

చిరంజీవి సామజిక న్యాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు.. ఆ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవడంతో, కాంగ్రెస్ లో విలీనం చేసారు.. చిరు కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.. తరువాత పరిస్థితులు మారిపోయాయి.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.. అదే సమయంలో చిరు సోదరుడు పవన్ జనసేన పార్టీ స్థాపించారు.. బీజేపీ,టీడీపీ పార్టీలకు మద్దతిచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసారు.. చిరు చిన్నగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ, మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.. పవన్ బీజేపీ,టీడీపీ పార్టీలకు దూరమై, సినిమాలకి బ్రేక్ ఇచ్చి పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్నారు.

 పవన్ అప్పుడప్పుడు ప్రజారాజ్యం సమయంలో అన్నయ్యని మోసం చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా అని ఆవేశంగా మాట్లాడటంతో.. పవన్, చిరు కోసమే పార్టీ పెట్టాడని.. జనసేన, ప్రజారాజ్యానికి సీక్వెల్ అని ఆరోపణలు, విమర్శలు వచ్చాయి.. అయితే పవన్ వీటిని పట్టించుకోకుండా ప్రజల్లో తిరుగుతూ, వచ్చే ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. కానీ మరొక్కసారి చిరు ప్రజారాజ్యం తెరమీదకి వచ్చింది.. చిరు అభిమాన సంఘ సభ్యులకు ' గతంలో ప్రజారాజ్యానికి పనిచేసినట్టే, జనసేనకు పనిచేయాలని' మెసేజ్ లు వస్తున్నాయట.. ఈ వార్త బయటికి రావడంతో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి.. చిరు తెర వెనుక ఉండి జనసేన పార్టీ నడిపిస్తున్నాడు.. ఇప్పుడే తెరముందుకు వస్తే జనసేన మరో ప్రజారాజ్యంలా అవుతుందని ప్రజలు భావిస్తారు.

అందుకే తమ్ముడిని తెర ముందు ఉంచి తెర వెనుక అంతా అన్నయ్య నడిపిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అభిమాన సంఘ సభ్యులకు మెసేజ్ లు అనే వార్తలో నిజమెంత ఉందో తెలీదు కానీ ఆ వార్త బయటికొచ్చినప్పటి నుండి జనసేన పార్టీ, తెరముందు పవన్, తెర వెనుక చిరు అంటూ సెటైర్స్ వినిపిస్తున్నాయి.. చూద్దాం మరి చిరు, పవన్ దీనిపై ఎలా స్పందిస్తారో.