ఒకపక్క ఇల్లు కాలుతుంటే.. మరోపక్క సెల్ఫీలు..


ఈ మధ్య సెల్ఫీలు ఎక్కడ తీసుకుంటున్నాం... ఏ ప్రదేశాల్లో తీసుకుంటున్నాం.. ఎలాంటి సందర్భాల్లో తీసుకుంటున్నాం.. అన్న విచక్షణను పూర్తిగా కోల్పోతున్నారు. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసకోవడం..ఏదో సాధించేసినట్టు ఫీలయిపోవడం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒకపక్కన ఇల్లుకాలిపోతుంటే.. మరోపక్క సెల్ఫీలు తీసుకున్న ఘటన చైనాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...  చైనాలోని నానింగ్ ప్రాంతంలో జాంగ్ చెంగ్ అనే వ్యక్తి..  "నేను ఆ సమయంలో బాత్ రూములో ఉన్నాను. ఏదో కాలుతున్న వాసన వచ్చింది. డోర్ తీసి చూస్తే మంటలు కనిపించాయి. వస్తువులన్నీ కాలిపోతున్నాయని తెలిసింది... వెంటనే వెళ్లి నా గర్ల్ ఫ్రెండ్ ను నిద్రలేపా. ఇద్దరమూ కలసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాం. ఇరుగు, పొరుగు వచ్చి సాయం చేశారు"  అంటూ తాము తీసుకున్న సెల్ఫీలు..వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది.

 

ఇంకా ఆశ్చర్యం ఏంటంటే..ఆరోజే వారు ఇంట్లో బర్త్ డే వేడుకలు జరుపుకున్నారట. మంటలు ఆరిపోయిన తరువాత, ఇల్లు శుభ్రం చేసే పనిని కూడా పక్కన బెట్టిన ఈ జంట, సెల్ఫీలు దిగుతూ, నష్టాన్ని చూసి తాము కుంగిపోవడం లేదని క్యాప్షన్లు కూడా పెట్టారు.