అమెరికాపై దాడి చేస్తే మేం రాము.. చైనా వార్నింగ్..

 

ఉత్తర కొరియా అమెరికాకు హెచ్చరికలు మీద హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా హెచ్చరికలకు బదులుగా అమెరికా కూడా రెచ్చిపోతూ.. వార్నింగ్ లు ఇస్తుంది. ఇక దీనిపై చైనా స్పందిస్తూ.. ఉత్తర కొరియాను మాత్రం ఆ పని చేయొద్దని హెచ్చరిస్తోంది. అంతేకాదు ఉత్తరకొరియాకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. అమెరికా విషయంలో ఆవేశంతో వ్యవహరించి అనర్థం కొని తెచ్చుకుంటే జరగబోయే పరిణామాలను ఒంటరిగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని, తాము సాయంగా రాబోమని తెలిపింది. అంతేకాదు... ఒకవేళ అమెరికానే ముందుగా క్షిపణులు ప్రయోగిస్తే అప్పుడు తాము జోక్యం చేసుకుంటామని కూడా తెలిపింది. మరి చైనా సమాధానానికి ఉత్తర కొరియా సమాధానం ఎలా ఉంటుందో..