చెన్నై "సత్యభామ"లో స్టూడెంట్ ఆత్మహత్య.. విద్యార్ధుల ఆందోళన..


చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మౌనిక అనే తెలుగు విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో విశ్వవిద్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అసలు సంగతేంటంటే... సత్యభామ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల కిందట  ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరిగాయి. అయితే ఈ ఎగ్జామ్స్ లో మౌనిక  కాపీ కొట్టిందని ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు పంపించారు. తరువాత పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక.. మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విద్యార్దులు ఆందోళనలు చేపట్టారు. యూనివర్సిటీలో విధ్వంసం సృష్టించారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు జనవరి 2 వరకూ సెలవులు ప్రకటించింది. యూనివర్సిటీలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి.

 

మరోవైపు మౌనిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మౌనిక తప్పు చేస్తే అందరి ముందూ కాకుండా పక్కకు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ చేసుంటే తాను బ్రతికుండేదని.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.