పొలిట్ బ్యూరోలో పలు కీలక అంశాలపై చర్చించనున్న టీడీపీ నేతలు...

 

భవిష్యత్ కార్యాచరణ కోసం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. కోడెల శివప్రసాద్ తో పాటు గోదావరి పడవ ప్రమాదం మృతులకు సంతాపం తెలపనున్నారు తెలుగు తమ్ముళ్ళు. అలాగే తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న నేతలు.. ఈ సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చలు జరపనున్నారు నేతలు. వీటితో పాటు భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చలు జరపనున్నారు. 

పార్టీ సంస్థా గత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ కమిటీలు మండల స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ కమిటీలను నియమించాలని కొద్ది రోజులుగా పార్టీ అధినేత కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యనాయకులతో భేటీలు కూడా జరుగుతున్నాయి. పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఈ సారీ పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలనే ఒక కొత్త ఆలోచన తలపెట్టిన నేపధ్యంలో దానికి సంబంధించి ఒక ఎన్నికల కమిటీని కూడా నియమించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించుకుందని, దానిలోని ఆంక్షలను ఈ రోజు పొలిట్ బ్యూరోలో ప్రధానంగా చర్చించనున్నారు పార్టీ నేతలు. 

వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటునటువంటి కొన్ని నిర్ణయాలపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా కొన్ని ఆందోళన కార్యక్రమాలను, కొన్ని నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టింది. కొన్ని పథకాలను నిలిపి వేయడం వల్ల ప్రజలపై భారం పడుతుందనేటువంటి ఆలోచనతో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇకముందు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నారు.వీటితో పాటు రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాల పరంగా ఎటువంటి పనులతో ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉందనే అంశంపై కూడా ప్రధానంగా పొలిట్ బ్యూరోలో చర్చిస్తారని సమాచారం. 

ముఖ్యంగా నిర్మాణ రంగంలోని  ఇసుక కొరత కారణంగా లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితి నెలకొంది. రియలెస్టేట్ పడిపోయినటువంటి కారణంతో మొత్తం రెవిన్యూ పడిపోయినటువంటి పరిస్థితి వచ్చిందని ఇలా ప్రభుత్వం తీసుకుంటునటువంటి నిర్ణయాల వల్ల ప్రజలపై ఎటువంటి భారం ఉంటుందని ,ప్రభుత్వం ఏరకంగా నష్టపోతుందనే అంశాలపై చర్చలు జరపనున్నారు నేతలు. రాష్ట్రం ఏరకంగా నష్టపోతుందనే అంశాలపై కొంత లోతుగా చర్చించేందుకు ఈ రోజు పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం పధ్ధెనిమిది మంది పొలిట్ బ్యూరో సభ్యులకు గానూ పదమూడు మంది దాదాపు ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. కొంతమంది అనారోగ్య కారణాలతో ఈ రోజు మీటింగ్ కి రాలేకపోయారు. దాదాపు రెండు మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది.మొత్తం మీద ఈ భేటీలో చాలా ముఖ్యమైన అంశాల పై చర్చలు జరపబోతున్నారని సమాచారం.