పవన్ వేస్తోన్న అడుగులతో చంద్రబాబుకి తిప్పలు!!

అమరావతి పై ఇవాళ్టి భేటీలో బీజేపీ-జనసేన పార్టీలు ఏ నిర్ణయం తీసుకోనున్నాయి అని అందరిలో ప్రశ్నల మొదలయ్యాయి. ఢిల్లీలో ఇటీవల కమలదళం పెద్దలతో భేటీ అయిన జనసేనాని బిజెపితో కలసి పోరాడేందుకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ్టి సమావేశం తర్వాత జనసేన కాషాయ సేనగా మారుతుందని భావిస్తున్నారు కొందరు నేతలు . ఢిల్లీ పెద్దల డైరెక్షన్ లోనే బీజేపీ రాష్ట్ర నేతలు జనసేన నాయకులతో భేటీ కాబోతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి సాగాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఏపిలో బిజెపి అవకాశం కోసం గట్టిగా ఎదురు చూస్తొంది, నాయకులున్నా కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతోంది బీజేపీ. పవన్ లాంటి వ్యక్తి తోడూ దొరికితే కమలం మరింత దూకుడు చూపిస్తుందంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.మూడు రాజధానుల ప్రతిపాదన అమరావతి ఆందోళనతో అట్టుడుకుతుండడంతో పొత్తుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు కొందరు నేతలు.ఏ పార్టీ అయినా బీజేపీ తోనే కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి దేశంలో ఉందని,కలిసి నడిస్తే దేనినైనా సాధించవచ్చని కొందరు కాషాయ నేతలు వెల్లడిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ వైపే చూస్తున్నాయన్నాయని ఈ నేపధ్యంలో జనసేన, బిజెపి కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యడం దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.ఈ మేరకు ఏపీ బిజెపి నేతలు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. 

ఏపిలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం టిడిపి అధినేత చంద్రబాబుకు ఒక రకంగా ఆందోళన కలిగించే విషయమే అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.ఇటీవల జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలోనూ మెజార్టీ నేతలు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా పవన్ కళ్యాణ్ ఆలోచన మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నట్లు సమాచారం.జనసేన బిజెపి కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టిడిపి, జనసేన బిజెపి కూటమి మధ్య చీలి పోతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.