చంద్రబాబుకి మరో భారీ షాక్..! వైసీపీలోకి కేఈ కుటుంబం..?

 

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేం... రాజకీయ సమీకరణాలు... పరిస్థితులకు అనుగుణంగా పొలిటికల్ లీడర్స్ ప్రాధాన్యతలు మారిపోతుంటాయ్... అందుకే కొందరు నేతలు... ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అస్సలు చెప్పలేం... ఎవరూ ఊహించనివిధంగా అప్పటివరకు తీవ్రంగా విమర్శించిన పార్టీలోకే వచ్చిచేరతారు... ఎవరో కొంతమంది తప్ప... దీనికి ఎవరూ అతీతులు కాదు... అందుకు తాజా ఉదాహరణ వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లే... ఇక, కొందరు విషయంలో అయితే అస్సలు ఊహించలేము... పార్టీ మారతారంటే నమ్మకం కష్టంగానే ఉంటుంది. అయితే, అలాంటి రూమరే ఒకటి ఇప్పుడు ఏపీలో వినిపిస్తోంది. కరుడుగట్టిన తెలుగుదేశం వాదిగా ముద్రపడ్డ కేఈ కృష్ణమూర్తి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. 

మూడు దశబ్దాలుగా కర్నూలు జిల్లా టీడీపీలో బలమైన నేతగా ఉన్న కేఈ ఫ్యామిలీ... కొంతకాలంగా చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా తనకు స్వేచ్ఛనివ్వలేదని, తనశాఖలో ఇష్టానుసారంగా లోకేష్ అండ్ నారాయణ జోక్యం కల్పించుకున్నారన్న ఆవేదన ఇప్పటికీ వెంటాడుతోందట. అంతేకాదు ఆనాడు రెవెన్యూశాఖలో తాను చేసిన బదిలీలను తనకు చెప్పకుండా నిలిపివేసి చంద్రబాబు తనను అవమానించారన్న బాధ కేఈలో ఉందట. అలాగే, తమ రాజకీయ ప్రత్యర్ధి కోట్ల కుటుంబాన్ని టీడీపీలో చేర్చుకోవడాన్ని అస్సలు జీర్జించుకోలేకపోతున్నారట. తమ మాటకు విలువనివ్వకుండా ఏకపక్షంగా కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకున్నారని ఎప్పట్నుంచో గుర్రుగా ఉన్న కేఈ కృష్ణమూర్తి... ఇక తెలుగుదేశానికి భవిష్యత్తు లేదని అంచనాకి వచ్చాకే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి దాదాపు రిటైర్మెంట్ తీసుకున్న కేఈ కృష్ణమూర్తి... కొడుకు శ్యామ్ బాబు కోసమే వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. 

అయితే, పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఇక, నారాయణరెడ్డి మర్డర్ సమయంలో కేఈ ఫ్యామిలీపై జగన్ సైతం తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఇప్పుడు కేఈ ఫ్యామిలీ మొత్తం వైసీపీ వైపు చూస్తుండటంతో జగన్ నిర్ణయం ఎలాగుంటుందోనన్న చర్చ జరుగుతోంది. అయితే, రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అంటే సెవంటీస్ లో ... వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి మంచి స్నేహితులు... వీళ్లిద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉండేవి. ఆ రిలేషన్-షిప్ తోనే జగన్ ను కేఈ సంప్రదించినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్, కేఈ శ్యామ్ బాబు, కేఈ జయన్న, కేఈ ప్రతాప్  తదితరులు వైసీపీ గూటికి చేరడం ఖాయమంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం తెలుగుదేశానికి భారీ నష్టం తప్పదు. మరి, ఇది నిజమో కాదో కాలమే చెప్పాలి.