అమరావతిని జగన్ చంపేస్తున్నాడు.. మోనర్క్ పాలన సరికాదు

అమరావతి రాకూడదని మూర్ఖత్వంగా కమిటీలపై క్యాంపింగ్ వేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే అమరావతి ప్రాజెక్టుని చంపేశారని ఆరోపించారు. అమరావతి ఆగిపోతే తెలుగు జాతికి తీవ్ర నష్టం చేసినట్లేనని ఆయన అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. మీ దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీ దగ్గర ఆధారాలుంటే తప్ప క్యాన్సిల్ చెయ్యడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అది కూడా మీ బుర్రకు ఎక్క లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికి కూడా ఎదురు దాడి చేస్తూ అమరావతి రాకూడదని.. దాని మీద కమిటీల మీద కమిటీలు వేస్తున్నారని ఆరోపించారు.

అసలు కమిటీలు దేనికంటూ.. నాకైతే అర్థం కావడం లేదన్నారు బాబు. మీరు ఎంత మూర్ఖత్వంగా ముందుకుపోతున్నారో.. సింగపూర్ గవర్నమెంట్ వెనక్కి వెళ్లినపుడే అర్థం చేసుకోవాలన్నారు. అమరావతి ప్రాజెక్టు దెబ్బతినింది, రాష్ట్ర భవిష్యత్ అంధకారమైంది. కనీసం తెలంగాణకి వెళితే ఒక హైదరాబాద్ సిటీ ఉంది.. కర్నాటకకు వెళితే బెంగళూరు సిటీ.. తమిళనాడు పోతే చెన్నై ఒక సిటీ.. ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఏముందండి ఇక్కడ అని చంద్రబాబు ప్రశ్నించారు.  మనం ఎక్కడికో ఎందుకు పోతామని అడిగారు. అధికారం లేక పోయినా పీపీఏలను రద్దు చేయడంతో ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసిందని విమర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు. కేంద్రం హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్రభుత్వ పరువు తీశారని మండిపడ్డారు. పీపీఏలు రద్దు చేశారు.. అలా చెయ్యడానికి అధికారం లేదు.. ఎందుకు రద్దు చేశావు అంటే కరెప్షన్ అంటాడు. ఇప్పుడు కోర్టు తనను తప్పని చెప్పే స్థాయికి వచ్చాడన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని చూసి తట్టుకోలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.