కేంద్రానికి బాబు లేఖ....

 

జనవరి 12 న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో భేటీ కానున్న సంగతి తెలిసిందే కదా. కానీ ఈలోపే చంద్రబాబు తన దూకుడిని పెంచారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి బాబు లేఖ రాశారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్‌ను వెంటనే విడుదల చేయాలని..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈఏపీ ప్రాజెక్టులను మంజూరు చేసి వెంటనే నిధులను విడుదల చేయాలని ఆయన కేంద్రానికి విన్నవించారు.   అంతేకాదు..  ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఏపీకి  కేటాయింపులపై కూడా చంద్రబాబు ప్రధానితో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పోలవరం విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పుడిప్పుడే సయోధ్య కుదురుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు లేఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.