ఆ మంత్రులకు వేటు తప్పదా...

 

ఏపీలో మరోసారి కేబినేట్ విస్తరణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో కేబినెట్ విస్తరణ చేయనున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే చంద్రబాబు మంత్రుల పనితీరుపై నివేదికను తెప్పించుకున్నారట. అయితే ఈ నివేదిక ప్రకారం.. ఐదుగురు మంత్రులకు వేటు తప్పదు అని చర్చించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో మొదట ఉన్న పేరు జవహర్. ఈయన బీరు గురించి.. వాటి లాభాల గురించి ఏ రేంజ్ లో చెప్పిన సంగతి తెలిసిందే. బీరు ఆరోగ్యానికి మంచిదని అన్నారు. ఇక వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి రాత్రి తొమ్మిదిన్నర దాటాక నగరి ఎమ్మెల్యే రోజాను చూడాలనడమే కాదు… కొన్ని సామాజిక వ‌ర్గాల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడారు. దీంతో చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా అఖిల ప్రియపై కూడా వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. నంద్యాల ఉపఎన్నికలలో కీలక పాత్ర పోషించినా.. ఈ గెలుపులో అఖిల ప్రియకు మార్కులు పడ్డా... మంత్రిగా పనితీరు సరిగా లేదని రిపోర్టు వచ్చిందట. ఇక బొబ్బిలి కోటకు చెందిన సుజయ కృష్ణ రంగారావు పనితీరు పై అంత సంతృప్తిగా లేరనే చర్చ సాగుతోంది. పితాని సత్యనారాయణ పనితీరు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో ఆయనపై కూడా వేటు పడే అవకాశం ఉందట. కనీసం నలుగురిని పక్కన పెట్టి మరికొందరికి స్థానం కల్పిస్తారంటున్నారు. చూద్దాం మరి వీరిలో ఎంతమందిపై వేటు పడుతుందో.. వేటు పడదో..?