సాయంత్రానికి ఎమ్మెల్యేలంతా విజయవాడలో ఉండాలి

రేపు జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలంతా సాయంత్రానికి విజయవాడ చేరుకోవాలని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అందరినీ ఒక రోజు ముందే బెజవాడకు రమ్మన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేయాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చిస్తారని, ఆ తరువాత అమరావతి అసెంబ్లీలో ఏర్పాటు చేసే పోలీంగ్ బూత్‌లో వీరంతా తమ ఓట్లు వేయనున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తరపున తొలి చంద్రబాబు నాయుడు తొలి ఓటు వేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు రేపు దేశవ్యాప్తంగా జరగనుండగా, 20న ఓట్ల లెక్కింపు జరిపి, అదే రోజున ఫలితాన్ని వెల్లడిస్తారు.