చంద్రబాబు అమెరికా టూర్‌... డే టు డే షెడ్యూల్‌ డిటైల్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా వెళ్లారు. ఐటీ, వ్యవసాయం, ఫిన్‌టెక్‌ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పర్యటన సాగనుంది. పలు రాష్ట్రాలతో అగ్రిమెంట్స్‌ చేసుకోవడంతోపాటు యాపిల్‌, సిస్కో, గూగుల్‌, ఒరాకిల్‌, టెస్లా వంటి దిగ్గజ కంపెనీల సీఈవోలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. పెట్టుబడులకు ఏపీలో ఉన్న అనుకూలతలు, కల్పించనున్న సౌకర్యాలను వివరించనున్నారు. ఇక ఈనెల 9న వరల్డ్‌ ఎకనమిక్ ఫోరం కార్యాలయంలో పోర్త్ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌ అంశంపై ప్రసంగించనున్నారు. అదేవిధంగా ప్రసాంధ్రులతో మూడుసార్లు భేటీకానున్నారు. చిత్తూరు జిల్లాలో యాపిల్‌ కంపెనీ ఏర్పాటుపై ఈ టూర్లో క్లారిటీ రానుంది. అదేవిధంగా టాప్‌ మోస్ట్‌ 30మంది సీఈవోలతో ముఖాముఖి కానున్న చంద్రబాబు... ఏపీలో శాఖలను ఏర్పాటు చేయాలని కోరనున్నారు. అలాగే కర్నూలు జిల్లాలో సీడ్‌ ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటుపై అయోవా యూనివర్శిటీతో ఒప్పందం చేసుకోనున్నారు. 

 

మొదటి రోజు... గ్లోబల్‌ కల్టిమేట్‌ లీడర్ అంశంపై కాలిఫోర్నియా రాష్ట్రంతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ చేసుకోనుంది. ఆ తర్వాత ఆమ్వే సంస్థ ప్రతినిధులతో బాబు భేటీకానున్నారు. అనంతరం వరిన్‌ మెడికల్‌ సంస్థను పరిశీలించనున్నారు. మొదటి రోజు చివరిగా ఒరాకిల్‌ సీఈవోతో సమావేశం కానున్నారు. రెండోరోజు యూఎస్‌ఐబీసీ ఏర్పాటుచేసిన బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌లో చంద్రబాబు బృందం పాల్గోనుంది. అనంతరం టెస్లా కార్యాలయానికి వెళ్లి ఎగ్జిక్యూటివ్స్‌తో బాబు భేటీకానున్నారు. ఆ తర్వాత ఎన్‌ఐవో సీఈవో వారియర్‌తో సమావేశమై...... అరిస్టా సీఈవోతో లంచ్‌ మీటింగ్‌కి హాజరుకానున్నారు. అనంతరం నుటానిక్స్‌ సీఈవోతో... హెవలెట్‌ సీఈవో వైట్‌మెన్‌తో భేటీకానున్నారు. రెండోరోజు లాస్ట్‌ మీటింగ్‌.... సీఎక్స్‌ కంపెనీ ప్రతినిధులతో జరగనుంది.

 

మూడోరోజు కేపీఎంజీ ప్రతినిధులతో బ్రేక్‌ ఫాస్ట్‌ భేటీకి హాజరుకానున్న బాబు టీమ్..... రాత్రికి డల్లాస్ చేరుకుని, ప్రవాసాంధ్రులతో డిన్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. నాల్గోరోజు అయోవా యూనివర్శిటీలో బాబు బృందం పర్యటించనుంది. వ్యవసాయరంగంలో నూతన పరిశోధనలను పరిశీలించనున్నారు. అలాగే సీడ్‌ ఉత్పత్తిపై అయోవా యూనివర్శిటీతో ఒప్పందం చేసుకోనున్నారు. చివరిగా ప్రవాసాంధ్రులతో డిన్నర్ మీటింగ్‌ జరగనుంది. 

 

ఐదోరోజు సిస్కో ఆఫీస్‌కు వెళ్లి ఎగ్జిక్యూటివ్స్‌తో భేటీ అవుతారు. ఇదే రోజు యాపిల్‌, ఫ్లెక్స్‌ ట్రానిక్స్‌, గూగుల్‌ కార్యాలయాలను సందర్శించనున్నారు. ఆ తర్వాత యూఎస్‌ఐబీసీ-వెస్ట్‌కోస్ట్‌ సమ్మిట్‌లో పాల్గోనున్నారు. ఐదోరోజు చివరిగా జాన్‌ ఛాంబర్స్‌ అండ్‌ సీఈవోలతో డిన్నర్‌ మీటింగ్‌లో పాల్గోనున్నారు. ఆరోరోజు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ ప్రతినిధులతో సమావేశంకానున్నారు. ఆ తర్వాత జెన్సీ అండ్ జాన్సన్ ‌కో ఎగ్జిక్యూటివ్స్‌తో భేటీ అవుతారు. అనంతరం డబ్యూఈఎఫ్‌ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

 

ఏడోరోజు వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు బృందం పాల్గోనుంది. ఎనిమిదోరోజు ఇలినాయిస్‌ గవర్నర్‌తో భేటీ అయి... ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. అనంతరం చికాగో నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.