టీడీపీకి ఆటుపోట్లు కొత్తకాదు

 

తెలంగాణలో ముందస్తు వేడి మొదలవడంతో టీడీపీ వ్యూహ, ప్రతివ్యూహల్లో బిజీ అయ్యింది.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకుని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ లో రాష్ట్ర టీడీపీ నేతలతో సమావేశమయ్యారు.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపై చర్చించారు.. కమ్యూనిస్టులు, కోదండరాం పార్టీ వైఖరిపై నేతలను ఆరా తీశారు.. అదే విధంగా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.. టీడీపీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని చంద్రబాబుకు నేతలు వివరించారు.. 20 సీట్లలో 35శాతం ఓటింగ్ పదిలంగా ఉందన్నారు.. మరో 20 సీట్లలో 32శాతం ఓటింగ్ ఉందని తెలిపారు.. తెలంగాణలో టీడీపీ బలం చెక్కు చెదరలేదని అన్నారు.. ప్రజల్లో తెరాసపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..  టీడీపీకి ఆటుపోట్లు కొత్తకాదన్నారు.. 36 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశామని తెలిపారు.. తెలుగు ప్రజల ఆదరాభిమానాలు టీడీపీకి తరగని ఆస్తని పేర్కొన్నారు.. కార్యకర్తలే టీడీపీ సంపదని వివరించారు.. దేశంలోనే తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు.