పవన్ ని అన్న మాటలు మిమ్మల్ని అంటే తట్టుకోగలరా?: బాబు

 

ఇసుక అంశంపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ దగ్గర ధర్నా చౌక్ లో దీక్షకు దిగారు. ఈ దీక్ష పన్నెండు గంటల పాటు సాగనుంది. చంద్రబాబు ఆందోళనకు మద్దతు తెలియజేసిన జనసేన తమ పార్టీ తరపున ఇద్దరు ప్రతి నిధులను పంపింది. దాంట్లో జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్, పార్టీ ప్రధాన కార్య దర్శి శివ శంకర్ ఉన్నారు .ఇసుక కొరత వల్ల ప్రాణాలు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల చిత్రపటాల దగ్గర నివాళులర్పించారు చంద్రబాబు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మీద సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి అధినేత. ఇసుక అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అధికార పార్టీ నాయకులు అదే పనిగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తాము మీకంటే ఎక్కువ తిట్టగలమని అన్నారు ఆయన. 

లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారని అలాంటి విమర్శలు మీపైనా, మీ కుటుంబంపైన చేస్తే తట్టుకోగలరా అని ప్రశ్నించారు చంద్రబాబు. అధికార నేతలకే కాదు తమకు కూడా ధైర్యం ఉందని,తిట్టడం చేతకాక కాదు తిట్టాలనుకుంటే  వాళ్ళ కంటే ఎక్కువగా తిట్టగలుగుతాము, కాని సభ్యత అడ్డం వస్తుందని గుర్తుపెట్టుకోమని తాను దుర్మార్గులని హెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు. ఒక జనసేన నాయకుడు ఇసుక లాంగ్ మ్యాచ్ చేస్తుంటే ఆయనపైన వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని అలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే  మీరు తట్టుకోగల్గుతారా మీ కుటుంబం గురించి చెప్పలేమా అని బాబు  తన ఆవేదనను వ్యక్తం చేశారు.మా నాయకులని తిట్టే పరిస్తితికి వచ్చారని.. అయినా పర్వాలేదు కానీ మమ్మల్ని తిటే సమయం మీరు ఉపయోగించుకోని ఈ పేద వాళ్లకు ఉచిత ఇసుక ఇవ్వండి, ఇసుక సరఫరా చేయండి చాతనైతే, చాతకాకపోతే మేము దద్దమ్మలమని ఒప్పుకోని రాష్ట్రానికి క్షమాపణలు చెప్పాల్సన అవసరం ఉందని బాబు ఘాటైన విమర్శలు చేశారు.దీని పై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.