చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. అక్కడే ఆమరణ నిరాహార దీక్ష..

 

ఏపీ ప్రత్యేక హోదాపై ఇప్పటికే ఏపీ నేతలంతా గత కొద్దికాలంగా ఢిల్లీ పార్లమెంట్ వేదికగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే వైసీపీ ఎంపీలు తమ పదవులు రాజీనామా చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయలేదు కానీ.. అక్కడే ఉండి ఇంకా నిరసన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబునాయుడే  ఆమరణ నిరాహార దీక్షకి దిగాలని నిర్ణయించుకున్నారట. కేవలం రెండు రోజులు పర్యటిస్తేనే దేశవ్యాప్తంగా చర్చ జరగటం, జాతీయ మీడియా అంతా ఫోకస్ చేయడం, కేంద్రం భయపడి ప్రదర్శనలు ఆపేసింది. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గనుక రాజధానిలో ఆమరణ నిరాహార దీక్షకి దిగితే ఇప్పటికే కర్ణాటకలో ఎంతో కష్టపడి ఎన్నికలకి సిద్దమవుతున్న వేళ బీజీపీని ఇరుకున పెట్టచ్చు అనే యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది.

 

అంతేకాదు ఈ ఆమరణ నిరాహార దీక్షకి తన పుట్టిన రోజు నాడే ప్రారంభిస్తే ఇంకాస్త వేడి పుట్టించవచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో పుట్టినరోజు నుండి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆమరణ దీక్షకి దిగనున్నారట. చంద్రబాబు గనుక దీక్ష ప్రారంభిస్తే ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఆమరణ దీక్ష మొదలుపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకి ఎక్కుతారు. అంతే కాకుండా మోడీ దుర్మార్గం దేశం అంతా తెలిపేందుకు ఈ దీక్ష మరింత సహాయం చేస్తుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలని, దీక్ష తీరు తెన్నులు మీద ఇప్పటికే ప్రత్యేక బృందం ఒకటి కసరత్తులు చేసిందట. మరి ఏకంగా చంద్రబాబే అక్కడికి వెళ్లి నిరాహార దీక్ష చేస్తే దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించక తప్పదు. మరి చంద్రబాబు పన్నిన వ్యూహంలో బీజేపీ చిక్కుకుంటుందా.. లేదా..? చూద్దాం ఏం జరుగుతుందో..