రెండు పేపర్లతో నోరు మాయించిన చంద్రబాబు...

 

రాష్ట్ర విడిపోయి దాదాపు నాలుగేళ్లు అయిపోయింది. ఈ మూడేళ్లు ఒక ఎత్తైతే ఈ ఏడాది మాత్రం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చలకు దారితీశాయి. దానికి కారణం ఏపీ ప్రత్యేక హోదా పోరాటమే కారణం. దీని కోసం మిత్రపక్షంగా ఉన్న బీజేపీ-టీడీపీ పార్టీలు సైతం విడిపోయాయి. ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు మీతో మేము ఎందుకు ఉంటాం అని బయటకు వచ్చేశారు. ఇక ఇప్పుడు బయటకు వచ్చిన తరువాత ఒక సమస్య. ఈ పని ఏదో ముందే చేసి వుంటే బావుండేది కదా అని మరో వాదన. అయితే అలా మాట్లేడే వారికి చంద్రబాబు మంచి ఆన్సర్ ఇచ్చారు.

 

అసలు సంగతేంటంటే... ఏపీ ప్రత్యేక హోదా పోరాటం నేపథ్యంలో చంద్రబాబు అఖిలపక్షం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సమావేశానికి   సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ఏపీ ఎన్జీవో సంఘం, ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి ఇలా చాలా మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం నేత మధు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఈ నాలుగేళ్లు అఖిలపక్ష సమావేశాలు జరిపి ఉంటే బాగుండేదని, మీరు ఎప్పుడో బయటకు రావాల్సింది, ఇప్పటి దాక ఎందుకు రాలేదు అంటూ, చంద్రబాబుని ప్రశ్నించారట. అయితే దీనికి చంద్రబాబు వారి ముందు రెండు కాగితాలు పెట్టారట. అది చూసి మొదట వారికి అర్దం కాలేదట. అప్పుడు చంద్రబాబు వాటిని చూపిస్తూ.... ఫిబ్రవరి 4 నుంచి మా ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన మొదలు పెట్టారు... ఫిబ్రవరి 9న వెనుకబడిన ప్రాంతాలకి, కేంద్రం 350 కోట్లు ఇచ్చింది... ఇది తెలుసుకున్న ప్రధాని కార్యాలయం, ఫిబ్రవరి 15న RBIతో చెప్పి, వేసిన డబ్బులు వెనక్కు తీసుకున్నారు...అలా ఉంటుంది వీరి కక్ష.


నాలుగేళ్ల ముందే నేను బయటకు వచ్చి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి... పోలవరం అసలు మొదలే అయ్యేది కాదు... అమరావతికి ఎన్నో ఇబ్బందులు వచ్చేవి (పర్మిషన్ల గురించి)... నాలుగేళ్లు అయ్యాకనే మనకివ్వాల్సింది మనం అడిగితే ఇలా చేస్తున్నారు.. తొలిరోజు నుంచే నేను దూకుడుగా వెళ్లివుంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగేది కాదా అని ప్రశ్నించారట. అంతేకాదు... ఒకవేళ నేను కనుక ముందే అలా చేసి వుంటే ‘సీయం కాస్త ఓపిక పట్టివుంటే బావుండేది, దూకుడుగా వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం చేశార’ని అప్పుడు మీరే అనేవారు అని అన్నారట. దాంతో చంద్రబాబు సమాధానం విన్న వారు ఏం మాట్లాడాలే తెలీక సైలెంట్ గా ఉండి పోయారట. మరి చంద్రబాబు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా... అందుకే వాళ్లు కూడా ఏం మాట్లాడలేకపోయారు. నాలుగేళ్ల క్రితమే తిరగబడి ఉంటే ఇచ్చిన ఆ చిల్లర కూడా ఇచ్చేవాళ్లు కాదేమో...