తెలుగువారిని అవమానిస్తూ అమిత్ షా లేఖ...

 

నాలుగేళ్ల పాటు ఏపీకి చాలా ఎక్కువ సాయం చేసినట్టు అమిత్ షా చంద్రబాబుకు తొమ్మిది పజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇక ఈలేఖపై స్పందించిన చంద్రబాబు కేంద్రంపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో అమిత్ షా లేఖపై మాట్లాడుతూ... తెలుగువారిని అవమానిస్తూ అమిత్ షా లేఖ రాశారని అన్నారు. అమిత్ షా లేఖలోని విషయాలు అన్నీ కట్టుకథలు, అర్ధసత్యాలని... ఉన్నతస్థాయిలోని వ్యక్తులు అబద్దాలు చెప్పకూడదని మండిపడ్డారు.

ఇంక చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు....

* నేను రాసిన లెటర్ చూడండి.. అమిత్ షా రాసిన లెటర్ చదవండి. ప్రజలను రెచ్చగొడుతున్నట్టు అమిత్ షా లేఖ ఉంది..
* జాతీయ స్థాయి నాయకులు తమ హుందాతనాన్ని తగ్గించుకోకూడదు
* కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ మోసం చేసిందన్న భావన ప్రజల్లో ఉంది... ఇది కాదనలేని సత్యం.
* ప్రజలు ఆందోళన చేస్తున్నా ఒక్క మాట కూడా స్పందించడంలేదు... చట్టంలోని అంశాలను అడిగితే ఎదురుదాడి చేస్తారా..?.. ఏపీ అంటే అంత చిన్నచూపు ఎందుకు..
* చాలా డబ్బులిచ్చేశాం అన్నట్టు మాట్లాడుతున్నారు.. ప్రజల పన్నుల్లో కొంతభాగన్ని మాత్రమే తిరిగి ఇస్తున్నారు. ఆర్ధికంగా స్ట్రాంగ్ గా ఉంటే వాళ్లని ఎందుకు అడుగుతాం..
* హోదాపై సెంటిమెంట్ ఎందుకు వచ్చింది.. కేంద్రం అన్యాయం చేసింది కాబట్టే సెంటిమెంట్ వచ్చింది..
* నడికుడి-కాళహస్తి రైల్వే లైన్ కు భూములిచ్చి.. 50శాతం నిధులు కూడా ఇచ్చాం... భూములు మావి... నిధులు మావి.. శ్రమ మాది.. పేరు మాత్రం వారిది..
* ప్రజల పక్షమా..ఢిల్లీ పక్షమా... ఏపీ బీజేపీ నేతలు తేల్చుకోవాలి.
* అరకొర నిధులతో విద్యాసంస్థలు పూర్తవడానికి 50, 60 ఏళ్లు పడుతుంది
* ఏకపక్షంగా మాట్లాడటం ఎంతవరకూ సమంజసం... అక్కడ డబ్బులు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టరు