చంద్రబాబు సాధించాడుగా...

 

మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుకున్నది సాధించాడు. ఇప్పటివరకూ నెలకొన్న గందగోళానికి ఎలాగూ తెర పడింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్డుపుల్ల వేసిన సంగతి తెలిసిందే కదా. పోలవరం కొంత పన్నుల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం టెండర్లకు పిలుపునివ్వగా... దానికి కేంద్రం అడ్డుకుంది. ఇక అంతే.. అప్పటినుండి చంద్రబాబుపై ఒకటే విమర్శలు గుప్పించారు ప్రతిపక్షపార్టీ నేతలు. కావాలనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని ఎన్నో కామెంట్లు చేశారు. కేంద్రం చేసిన పనికి ఎంతో సహనంగా ఉన్న చంద్రబాబు కూడా కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు కేంద్రం దిగొచ్చింది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, స్పిల్ చానల్ నిర్మాణానికి ప్రత్యేకంగా టెండర్లు పిలవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఒకే చేసింది.

 

అసలయితే ఈ పనులన్నీ ప్రధాన కాంట్రాక్టర్ అయిన ట్రాన్స్ టాయ్ చేయాలి. కానీ ఆర్ధిక పరిస్థిలను ఆలోచించి... చంద్రబాబు సబ్ కాంట్రాక్టులు పెట్టించి పనుల్లో వేగం పెంచారు. దీంతో అత్యంత కీలకమైన పనులు ట్రాన్స్ టాయ్ చేస్తుంది.. చిన్నచిన్న వర్క్ సబ్ కాంట్రాక్టర్లు చేస్తున్నారు. అయితే ఈ పనుల్లో కూడా వేగం మందగించడంతో... ఆ పనుల్లో కొంత భాగం విడదీసి కొత్త టెండర్లకు పిలుపునిచ్చింది. అయితే దానికి ట్రాన్స్ టాయ్ అభ్యంతరం చెప్పింది. జలవనరుల శాఖకు పిర్యాదు చేసింది. దీంతో కేంద్రం ఏపీ పిలుపునిచ్చిన టెండర్లను నిలిపివేసింది. దీంతో కేంద్రంపై చంద్రబాబుతో పాటు ఏపీ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కాఫర్‌ డ్యాం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టెండర్లను సైతం ఆపేసిన కేంద్రానికి జాతీయ జల విద్యుత్ పరిశోధన బృందం ఓ ఝలక్ ఇచ్చింది.  ఓ వైపు నుంచి కాఫర్‌ డ్యాం, మరోవైపు నుంచి ప్రధాన డ్యాం నిర్మించుకుంటూ వెళ్లి వీటిని అనుసంధానించడం ద్వారా నీటిని నిలబెట్టుకోవచ్చంటూ జాతీయ జల విద్యుత్ పరిశోధన బృందం (ఎన్‌హెచ్‌పీసీ) కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చేసింది. చంద్రబాబు కూడా స్వయంగా కేంద్ర జలవనరులశాఖ మంత్రి గడ్కరీతో మాట్లాడారు. ఇక చంద్రబాబు బాధను కూడా అర్దం చేసుకున్నకేంద్రం టెండర్లకు పిలుపునిచ్చింది. దీంతో చంద్రబాబు కల తీరే అవకాశం దక్కింది. ఏది ఏమైనా చంద్రబాబు అనుకున్నది సాధించారు...