బాబు సస్పెన్స్ లో పెట్టిన ఆ వ్యక్తి ఎవరు..?

 

ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితనం గురించి అందరికీ తెలిసిందే. ముందు చూపుతో ఆలోచించాలన్నా... ఏదైనా అభివృద్ది చేయాలన్నా... అనుకున్నది సాధించాలన్నా ఆయనకే సాధ్యం. అందుకే ఆయన పనితనాన్ని పత్యర్ధులు సైతం పొగిడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఆయనకు కలిసిరావడం లేదు.  ఒకపక్క రాష్ట్రం విడిపోయి.. ఆర్ధిక కష్టాల్లో ఉంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం... చాలి చాలని నిధులు విదుల్చుతూ.. ఏవో కుంటిసాకులు చెబుతూ ఆయన్ని కష్టపడెతూనే ఉంది. అయినా కూడా మొక్కవోని దీక్షవోలే... ఏపీ అభివృద్ది కొరకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. రాష్ట్రానికి, కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురావడానికి... ప్రయత్నిసున్నారు. కానీ ఏం లాభం.. కేంద్ర ప్రభుత్వం పుణ్యమా అని సగం ప్రాజెక్టులు పెండింగుల్లోనే ఉన్నాయి. ఏదోలా కష్టపడి పోలవరాన్ని అయినా పూర్తి చేద్దామనుకుంటుంటే... దానికి కూడా పుల్ల పెట్టింది. అందుకే కేంద్రం ఎన్ని చేసినా.. ఎంత సతాయించినా సైలెంట్ గా ఉన్న చంద్రబాబు...పోలవరం విషయంలో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అంతేకాదు ఇప్పుడు తాజాగా మరోసారి ప్రాజెక్టులు లేట్ అవ్వడంపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు... ప్రాజెక్టుల పూర్తి విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు...మేము ఎంతో గ్రౌండ్ వర్క్ చెయ్యటం, ఆ ప్రాజెక్ట్ విషయంలో 99.9 శాతం మంది ప్రజలు సహకరించటం, చివర్లో ఒకడు వెళ్లి కేసు వెయ్యటం, ప్రాజెక్ట్ లేట్ అవ్వటం... ఇదే జరుగుతుందని అన్నారు. దానికి గాను ఆ అడ్డుకునే వ్యక్తి ఎవరు సార్...? ప్రతి ప్రాజెక్ట్ లో అడ్డుపడుతుంది ఒక్కరేనా సార్ ? దీంట్లో రాజకీయ ప్రయోజనం ఉంది అంటారా అని అడగగా, చంద్రబాబు స్పందిస్తూ, ఆ ఒక్కరూ ఎవరో మీకు తెలుసుగా అని బదులు ఇచ్చారు.. సమాజంలో అంతా బాగుంటే ఓర్వలేనివారు, అత్యాశపరులు కొందరుంటారు... వారే ఇలాంటివి చేస్తారు అని అన్నారు. అయితే ఆ ఒక్కరు ఎవరూ అనే విషయాన్ని... చంద్రబాబు నోటితో చెప్పించాలని విలేకరులు చాలా ప్రయత్నించారట... కానీ చంద్రబాబు మాత్రం, పేరు బయటకు చెప్పకుండా, అతను ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసులే అని అన్నారట. మొత్తానికి చంద్రబాబు ఓ వ్యక్తి ఎవరో చెప్పకుండా మంచి సస్పెన్స్ లో పెట్టారు. ఇంతకీ చంద్రబాబు సస్పెన్స్ లో పెట్టిన  ఆ వ్యక్తి ఎవరో మీకు అర్దమైందా...?