పక్క దేశంలో చంద్రబాబు ఛాలెంజ్...

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్బంగా ఆయన  బుసాన్ లో నిర్వహించిన బిజినెస్ సెమినార్ లో పాల్గొన్నారు.  అయితే ఈ సెమినార్ లో చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వాళ్లకు ఓ సవాల్ కూడా విసిరారు. అదేంటనుకుంటున్నారా..? ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అత్యుత్తమ ప్యాకేజ్ ఇస్తున్నామని, తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు 21 రోజుల్లో సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందని, ఈ మూడేళ్లలో 26 పురస్కారాలను అందుకున్నామని, ‘కియా మోటార్స్ ను అడగండి, ఏపీ సమర్ధత ఏంటో చెబుతుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల రాష్ట్రంగా ఏపీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఏపీకి కియా మోటార్స్, హీరో, ఇసుజ్, భారత్ బెంజ్ పరిశ్రమలు వస్తున్నట్టు చెప్పారు.