బాబుపై కోపంతో...జగన్ కు చేరువవుతున్న టాలీవుడ్

 

తెలుగు చిత్ర పరిశ్రమకు, రాజకీయాలకు చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి.  స్వర్గీయ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీరామారావు రాకీయ రంగప్రవేశంతో అది మరింత బలపడింది. అప్పటి నుండి చాలా మంది సినీ ప్రముఖలు అడపా దడపా రాజకీయ రంగ  ప్రవేశం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు రాజకీయ నేతలు కూడా సినీ గ్లామర్ ను కూడా బాగానే వాడుకుంటున్నారు. ప్రజల్లో వారిపై ఉండే అభిమానానికి నాలుగు ఓట్లు ఎక్కువగా వస్తాయని వారి అంచనా. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. దానికి తోడు ఈ మధ్య ప్రత్యేక హోదా పోరాటం విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు చిత్రపరిశ్రమను, హీరోలను, నటులను నిందిస్తూ.. సిగ్గులేదా.. చేవచచ్చిందా అంటూ తీవ్ర విమర్శలు చేయడంతో పెద్ద దుమారం రేగింది. దీనికి ఆజ్యం పోసినట్టుగా ఇటీవల ఓ న్యూస్ యాంకర్ కూడా ప్రత్యేక హోదా కోసం సినీ తారలు ఏం చేయరా అని ఏకంగా బూతులే తిట్టేశాడు. దీంతో చిత్ర పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. సదరు ఎమ్మెల్సీ పైన, యాంకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ’ఇన్నాళ్లు మాపై ఎన్ని ఆరోపణలు, దాడులు చేస్తున్నా సహించాం, మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని బలిచేయాలని చూస్తే.. ఇక సహించేది లేదు. దాసరి నారాయణరావు గారే బతికుంటే పరిస్థితి మరోలా ఉండేది‘ అంటూ కొందరు నటులు హెచ్చరికలు కూడా చేశారు.

 

ఇదిలా ఉండగా ఇప్పుడు ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు... వాళ్లు నోరుజారడం... పాపం చంద్రబాబుకు పనిష్మెంట్ లా ఉంది. ఎందుకంటే...  తమను చులకనగా చూస్తున్న చంద్రబాబునాయుడి నాయకత్వంలోని టీడీపీకి ఇకపై ఎవ్వరూ సపోర్టు చేయకూడదని సినీ పెద్దలు, నటులు నిర్ణయం తీసుకున్నారట. ఇంకా అశ్చర్యకరమైన విషయం ఏంటంటే... టీడీపీకి దూరమవుతున్న చిత్ర పరిశ్రమ జగన్ కు చేరువవుతున్నట్టు తెలుస్తోంది.

 

సినీ పరిశ్రమలో ఉన్న దాదాపు చాలా మంది ఇప్పటికే టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. చిరంజీవి ఎలాగూ కాంగ్రెస్ లో ఉన్నారు. పవన్ ఏకంగా పార్టీనే పెట్టాడు. ఇక నందమూరి వారసత్వంలో ఫేస్ వ్యాల్యూ ఉన్న బాలకృష్ణ సీఎం చంద్రబాబు నాయడుకి వియ్యంకుడన్న సంగతి తెలిసిందే. కానీ హరికృష్ణ కుటుంబం మాత్రం పరోక్షంగా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ వస్తోంది. హరికృష్ణ కు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం, 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేశారన్న భావనతో వారు టీడీపీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక అక్కినేని నాగార్జున మొదట్నుంచి జగనతో సన్నిహితంగా ఉంటున్నారు. మూవీ మొఘల్, దివంగత నిర్మాత రామానాయుడు టీడీపీ తరుపున ఎంపీగా చేశారు. ఆయన అనంతరం వారి వారసులు నటడు వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. కాని చంద్రబాబుతో వచ్చిన విభేదాల వల్ల వీరు కూడా టీడీపీ కి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబం మొత్తం జగన్ వెంటే ఉంది. కుమారుడు విష్ణు పెళ్లితో వైఎస్ కుటుంబానికి బంధువయ్యారు మోహన్ బాబు. అప్పటి నుంచి జగన్ కు తన పూర్తి మద్ధతు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక మొన్నటి వరకు టీడీపీతో కొంత అనుబంధం కొనసాగిస్తున్న నటులు కూడా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో పూర్తి తెగదెంపులు చేసుకున్నారట. వెరసి నందమూరి వంశంలోని బాలకృష్ణ, నారా హీరోలు, ఎంపీ మురళీ మోహన్ వర్గం, మినహా దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది టీడీపీ, ముఖ్యంగా చంద్రబాబు అంటేనే మండిపడుతున్నారట. దీంతో చంద్రబాబు పై ఉన్న కోపంతో వీళ్లంతా జగన్ కు మద్దతిస్తారని.. అంతేకాదు.. అవసరమైతే ప్రచారంలోకూడా పాల్గొనే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది...