చంద్రబాబు @ 1500 కి.మీ

 

 

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 63 సం.ల వయసులో రాష్ట్ర మంతటా పాదయాత్ర చేయాలని ఒక క్లిష్టమయిన, సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొన్నపుడు, పార్టీ సీనియర్ నేతలు అందరూ అయన నిర్ణయాన్ని వ్యతిరేఖించారు. ఇక, అయన స్వంత కుటుంబము ఏవిదంగా స్పందించి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


చంద్రబాబు తన నిర్ణయానికే కట్టుబడి గత అక్టోబరు నెలలో అనంతపురం జిల్లా హిందూపురం నుండి తన పాదయాత్ర మొదలు పెట్టినపుడు, అయన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు కూడా ఆయన ఆరోగ్యం, వయసు దృష్ట్యా చాలా ఆందోళన చెందారు. ఏదోఒకరోజు, ఆయనంతట ఆయనే పాదయాత్ర విరమిస్తున్నట్లు ప్రకటన చేస్తారని భావించేరే తప్ప, అయన ఏకంగా 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక కొత్త రికార్డు సృష్టించి, ఈవిదంగా తెలుగుదేశంపార్టీ కీర్తి ప్రతిష్టలను ఇనుమడించగలరని ఎవరూ కూడా ఆనాడు ఊహించలేకపోయారు. అచంచలమయిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు కొద్ది రోజుల క్రితమే 1000కి.మీ. పాదయాత్ర పూర్తిచేసుకొని అందరి మన్ననలు పొందుతూ ముందుసాగి, నేడు వరంగల్ జిల్లా దస్రూనాయక్ తండా వద్ద తన పాదయాత్రలో 1500 కి.మీ. మైలురాయి కూడా దాటి మరో కొత్త రికార్డు సృష్టించేరు.

 

ఆ విదంగా చంద్రబాబు ఈ నూతన సంలో ఒక నూతన రికార్డ్ సృష్టించడమేగాకుండా, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేకర్ రెడ్డి చేసిన 1468 కి.మీ. పాదయాత్ర రికార్డును కూడా అయన అదిగమించారు. రాజశేకర్ రెడ్డి 53 సం.ల వయసులో 1468 కి.మీ. పాదయాత్రచేయగా, చంద్రబాబు 63 సం.ల వయసులో1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక కొత్త రికార్డు సృష్టించి అందరినీ సంభ్రమాశ్చర్యాలలోముంచెత్తారు.

 

తనకంటే వయసులో ఏంతో చిన్నవ్యక్తి అయిన ప్రతిపక్షపార్టీ నేత ఆరోగ్యకారణాలతో పాదయాత్ర చేయలేక మద్యలోనే విరమించుకొంటే, చంద్రబాబు ఈ వయసులో కూడా ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగించడం అందరిని ఆకర్షించింది.