టిఆర్ఎస్, వైఎస్ లఫై బాబు ఫైర్

 

కరీంనగర్ జిల్లాలో పాద యాత్ర సాగిస్తున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు టిఆర్ఎస్ పార్టీ, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి లఫై తీవ్ర విమర్శలు చేశారు. టిఆర్ఎస్ ను తిరకాసు పార్టీగా అభివర్ణించిన బాబు, పనిలో పనిగా వైఎస్ ఫైన కూడా విమర్శలు చేశారు. వైఎస్, తన అల్లుడికి 1.46 లక్షల ఎకరాల భూమిని కట్టబెట్టారని బాబు విమర్శించారు.

 

తెలుగు దేశం పార్టీ తెలంగాణా కు వ్యతిరేకం కాదని, తాను ప్రత్యెక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని బాబు వివరించారు. ఇక ముందు కూడా తాను తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడనని బాబు స్పష్టం చేశారు.

 

అలాగే, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలఫై వరాల వర్షం కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే, రైతులకు రోజుకు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని, రైతుల రుణాలను మాఫీ చేసి, వడ్డీ లేని రుణాలు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ముస్లిం లకు 15 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పత్తికి మద్దతు ధర నాలుగు వేల రూపాయలు ఉండేటట్లు చూడాలని బాబు డిమాండ్ చేశారు.

 

రైతుల విషయంలో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు దారుణంగా ఉందని బాబు విమర్శించారు.