ఫోన్లో నెట్.. జీవితాలు తాకట్టు.

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే అనుకుంటాం.. కానీ మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని పట్టించుకోనప్పుడు మన చేతిలో ప్రపంచం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం.

 

 


ఒకప్పుడు మన అనుకున్న వాళ్ళు దూరంగా ఉంటే ఉత్తరాలు రాసుకునే వారు.. తరువాత ఫోన్ హలో అంటూ పలకరించి ఆ దూరాన్ని దగ్గర చేసింది.. తర్వాతర్వాత ఫోన్ వాడకం పెరిగిపోయి దూరంగా ఉన్నవాళ్ళని దగ్గర చేయాల్సింది పోగా దగ్గరున్న వాళ్ళని కూడా దూరం చేస్తుంది.. ప్రతి వ్యక్తి జీవితంలో ఫోన్ ఒక భాగమైపోయింది.. ప్రస్తుతం జియో పుణ్యమా అని ఫోన్ బాడీలో ఒక పార్ట్ అయిపోయింది.. దీని ఆఫర్ల మోతతో ఇతర కంపెనీలు భయపడ్డాయి.. ప్రజలు ఆనంద పడ్డారు.. ఇక మిగతా కంపెనీలు కూడా ఆఫర్లు మొదలుపెట్టాయి..  అంతా నెట్ మయం అయిపోయింది.

 

 

గేమ్స్, వీడియోస్, చాటింగ్ ఇలా ఫోన్ లో మునిగిపోతూ పక్కన వాళ్ళకి దూరమవుతున్నారు.. ఫోన్ పుణ్యమా అని మన వాళ్ళకి దూరమవ్వడమే కాదు, మనకి మనమే దూరమవుతున్నామట.. అర్ధంకాలేదా.. 24 గంటలు ఫోన్ వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయట.. అందుకే ఫోన్ వాడకం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.. తెలిసింది కదా.. ఫోన్ వాడకం తగ్గించండి.. మీ వాళ్ళతో ఆనందంగా గడుపుతూ, ఆరోగ్యంగా ఉండండి.