రాజకీయ వలయంలో సీబీఐ

 

 

cbi congress, congress cbi, cbi supreme court, congress supreme court

 

 

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం "సుప్రీం కోర్టు" ఇటీవల చేసిన వ్యాఖ్యలు సర్వత్రా సంచలనం రేకెత్తించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పంజరంలో చిలుకలా మారిందంటూ సుప్రీం చేసిన వ్యాఖ్య దేశంలో పెద్ద దుమారాన్నే లేపింది. దానికి తోడు సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అవునని సుప్రీం మాటలని సమర్ధించడం దేశ ప్రజలందరిని మరింత విస్మయానికి గురిచేసింది. వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే... కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ, ప్రభుత్వమూ రెండు కుమ్మక్కై నిస్పాక్షికత లోపించిన విచారణను నిర్వహిస్తున్నదని.


సుప్రీం మాటల నేపథ్యంలో సీబీఐ కి సర్వస్వతంత్రతను కల్పించటమే ప్రభుత్వం రంజిత్ సిన్హా చేసిన ముందున్న ఏకైక పరిష్కారం. సీబీఐ కి స్వతంత్రత కల్పించటం అన్నది ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, భాజాపాలకు సుతరాము ఇష్టం లేని వ్యవహారం. ఒకటి మాత్రం నిజం- పార్టీలతో సంబంధం లేకుండా, పార్లమెంట్ బిల్ తో సంబంధం లేకుండా సీబీఐ తనకు తానుగా బాగుపడే సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. ఇప్పటికైనా సుప్రీమ్ కోర్ట్ ముందుకు వచ్చి బాహ్య ప్రభావాల బారిన సీబీఐ పడకుండా నిరోధించే చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం మంగళవారం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సీబీఐ స్వతంత్రతను పరిపుష్టం చేసేన్దుకున్న మార్గాలు, బాహ్య ప్రభావాలనుంచి రక్షణ కల్పించటానికి ఉన్న మార్గాలపై ఈ బృందం సమాలోచనలు చేస్తుంది.

  

    ఇంతవరకు జరిగిన అన్ని సంఘటనల నేపథ్యంలో సీబీఐ ప్రవర్తన తీరును పరిశీలిస్తే.... బొగ్గు కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ నివేదిక సమర్పించక ముందే ప్రభుత్వానికి చూపించింది. న్యాయశాఖా మంత్రి, ప్రధాని కార్యాలయం అధికారులు ఆ నివేదికను చూసిన వారిలో ఉన్నారు. ఈ విషయంలో న్యాయ శాఖా మంత్రి అశ్విని కుమార్, ప్రధాని కార్యాలయం అధికారులు చేసిన దానికన్నా సీబీఐ డైరెక్టర్ చేసిన నేరం తక్కువ ఎలా అవుతుంది? రాజకీయనాయకులను ఏమంటాం? నీతి, నిజాయితి అంటే ఎలా ఉంటాయో మర్చిపోయిన నీచులు వాళ్ళు. కనీసం ప్రజల సొమ్ము తింటున్న ప్రభుత్వ ఉద్యోగులైన నీతి, నిజాయతీలతో పనిచెయొద్దా?
       

 

  ఉద్యోగ విరమణ తర్వాత భారీ వేతనం, గొప్ప సోకర్యాలతో కూడుకున్న పదవుల కోసం వారు అంతగా సాగిల పడాల? ఇది ఒక్క సీబీఐ సంస్థకు మాత్రమే వర్తించదు. ఐఏఎస్ లు, ఐపిఎస్ లు, పోలీస్ డిపార్టుమెంటు, జడ్జిలు, ఇతర ప్రభుత్వ అధికారులు... ఇలా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలలోనూ రాజకీయ ప్రమేయం ఉంటే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది? రాజశేఖర రెడ్డి జమానాలో జరిగిన విపరీతమైన రాజకీయ జోక్యం ఫలితంగానే ఈ రోజు పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో మగ్గుతున్నారు.

      

  నీతి, నిజాయితీలకు ప్రాణం పెడుతూ, ఏ  రాజకీయనాయకుడిని లెక్కచెయ్యని అశోక్ ఖేమ్కా లాంటి ఆఫీసర్లు ఉన్నారు. ఎంతో నీతిమంతుడైన ఐఏఎస్ అధికారి ఆయన. అందుకే రాజకీయ నాయకులు, పాలకులు ఆయనను ఒక్క చోట కుదురుగా ఉంచటం లేదు, పనిచేసుకోనివ్వడం లేదు. అతి తక్కువ కాలం లోనే అత్యధికసార్లు బదిలీ ఐన అధికారిగా ఇప్పటికే ఆయన పేరు లిమ్కా రికార్డుల పుస్తకానికి ఎక్కింది. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఆయనది. ఆయన హర్యానాలో పనిచేసారు. ఓం ప్రకాష్ చౌతాలా ప్రభుత్వంలో 5సం.ల కాలంలో 9 సార్లు బదిలీ అయ్యారు. ఆయన 21 సం.ల సర్వీస్ లో 40 సార్లు బదిలీ అయ్యారు. ఆయన నిజాయితీకి రాబర్ట్ వాద్రా అవినీతి కేసుల విషయంలో ప్రాణ హాని హెచ్చరికలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

   

మరి ఇంతగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆఫీసురు నీతి నిజాయితీల పరంగా ఇన్ని ఇబ్బందులు పడుతూ, ఆ ఇబ్బందులు లిమ్కా బుక్కు రికార్డ్సు వరకు వెళ్ళినా కాని కలగని చైతన్యం సుప్రీం కోర్టుకు ఈనాడు సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా వ్యవహారంలోనైనా కలగటం ఇపాతికైనా స్వాగతిన్చదగినదే.

      

చివరిగా ఒక్క మాట ఒక పదవి, అధికారం అంటే... నిజాయితీ, అవగాహన, ధైర్యం, సాహసంతో కూడుకున్న వ్యవహారం. ఈ లక్షణాలన్నీ ఉన్న అధికారి ఎవరైనా ప్రజలకోసం పాటుపడడానికి వస్తే వారిని కాపాడుకునే ప్రయత్నం లో ప్రజలందరూ సమాయత్తం అవ్వాలి. ఎందుకంటే వారి శ్రమ, తెగువ, చొరవే... భావిభారతం.