జగన్ పై 11వ చార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ

 

జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే పది చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ ఈ రోజు తాజాగా మరో చార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం. షరా మామూలుగానే ఇది కూడా క్విడ్ ప్రో కేసే, ఇందులో కూడా జగన్, విజయ సాయి రెడ్డి ఇద్దరూ పద్మ, ద్వితీయ స్థానాలలో నిందితులుగా పేర్కొనబడ్డారు. ఈ కేసులో శ్యాం ప్రసాద్ రెడ్డికి చెందిన ఇందూ హౌసింగ్ ప్రాజెక్టు సంస్థకు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేత ఉదారంగా అనేక హౌసింగ్ ప్రాజెక్టులు మంజూరు చేయించగా, ఇందూ సంస్థ ఆ ఋణం ఉంచుకోకుండా ఇందూ సంస్థ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలలో భారీ పెట్టుబడులు పెట్టిందని సీబీఐ చార్జ్ షీటులో ఆరోపించింది. క్లుప్తంగా ఇదీ కేసు.

 

 చార్జ్ షీట్ దాఖలు చేయడం వరకే సీబీఐ పని. ఆ తరువాత మళ్ళీ అది ఎప్పుడు విచారణకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మార్చ్ 2002లో సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జ్ షీటుకే ఇంతవరకు మోక్షం రాలేదు. కనుక ఈ 11వ చార్జ్ షీటు ఎప్పుడు విచారణకు వస్తుందో, దానిపై వాదనలు ఎప్పుడు పూర్తవుతాయో, కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుందో చెప్పడం ఎవరితరమూ కాదనే చెప్పవచ్చును.