వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా బుట్టా రేణుక..!!

 

బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎంపీగా గెలిచారు.. తరువాత టీడీపీలో చేరారు.. ఇక అప్పటినుండి బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ కోరుతోంది.. అయితే ఇప్పుడు వైసీపీకి ఓ ట్విస్ట్ ఎదురైంది.. పార్టీ ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశంలో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా బుట్టా రేణుక పేరును జాబితాలో చేర్చారు.. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.. తాజాగా ఈ విషయంపై వైసీపీ నేత విజయ సాయి రెడ్డి స్పందించారు.. అఖిలపక్ష సమావేశానికి బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.. ఇది టీడీపీ, బీజేపు కుమ్మక్కుకు నిదర్శనం అని, ఆ రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాయని ఆరోపించారు.